ఇందుకు గానూ ISO BUSTER అనే Software బాగా ఉపయోగపడుతుంది.
సైట్ లింక్ : http://www.smart-projects.net/isobusterdownload.php
ఈ సాఫ్ట్ వేర్ తొ నాకు తెలిసి ముఖ్యంగా 3 రకాల ఉపయోగాలున్నాయి. అవి
1. ఓపెన్ కాని సిడి లేదా డివిడి లను ఓపెన్ చేసుకుని దానిలోని కాంటెంట్ ను సిస్టం లొకి కాపి చేసుకుని మరల మనం కొత్త సిడి లేదా డివిడి గా చేసుకుని ఆ కాంటెంట్ ను భద్రపరచుకోవటం.
2. కాపి కాకుండా మొరాయించే సిడి లేదా డివిడి ల ను సిస్టం లొకి కాపి చేసుకోగలగటం.తర్వాత మనం సిడి లేదా డివిడి లోకి రైట్ చేసుకోవటం.
3. బూట్ ఇమేజ్ ని కాపి చేసుకుని బూటబుల్ సిడి లేదా డివిడి లను తయారుచేసుకోగలగటం.
ముందుగా మనం మనకు ఓపెన్ కాకున్న లేదా కాపీ కాకున్న సిడి లేదా డివిడిని డ్రైవ్ లొ ఉంచినపుడు మనకు లెఫ్ట్ పేన్ లొ ట్రాక్ లు గా కనపడతాయి. వాటిని మనం Extract చేసుకోవచ్చు. తర్వాత వాటిని మనం మరల కొత్త సిడి లేదా డివిడి లొకి సిస్టం నుండి కాపిచేసుకోవచ్చు. బాగా పాడైన సిడి లేదా డివిడి అయితే మనకు ఒకోసారి పూర్తి సిడి లేదా డివిడి కాంటెంట్ కాపి కాకపోవచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి